TG: విదేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్ట
ి విక్రమార్క, గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన రూ.303 కోట్ల ఉపకార వేతనాల బకాయిలన
ు వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ డబ్బును త్వరగా చెల్లించి, విద్యార్థుల కష్టాలను తీర్చాలని ఆయన సూచించారు. ఇకపై ఇలాంటి ఆలస్యం జరగకుండా చూస్తామని వారు
హామీ ఇచ్చారు.