గుడ్‌ న్యూస్.. తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక రైళ్లు

23953చూసినవారు
గుడ్‌ న్యూస్.. తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక రైళ్లు
తీర్థయాత్రలకు భక్తుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ IRCTC ప్రత్యేక రైలు, విమాన ప్యాకేజీలను ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు జరిగే ‘దివ్య దక్షిణ యాత్ర’లో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ వంటి ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించవచ్చు. ధరలు స్లీపర్ ₹14,100, 3AC ₹22,500, 2AC ₹29,500. పూర్తి వివరాలకు 9701360701, 9281030726, 9281030750 నెంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్