తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ప్రజా జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పై ప్రదర్శించిన 'KGF' తరహా వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి పోరాట పటిమను, ప్రజల కోసం సాగించిన ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వీడియో ఆయన ఆభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.