గోరఖ్‌పూర్ నీట్ అభ్యర్థి దీపక్ గుప్తా హత్య కేసులో ప్రధాన నిందితుడైన స్మగ్లర్ మహ్మద్ జుబైర్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం రాత్రి రాంపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చేశారు. జుబైర్‌పై అనేక కేసులున్నాయని, అతనిపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఈ నెల 16న గోరఖ్‌పూర్‌లో జుబైర్ పశువులను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన నీట్ అభ్యర్థి దీపక్ గుప్తా (19) అతడిని అడ్డుకున్నాడు. దాంతో జుబైర్ అక్కడికక్కడే దీపక్‌ను చంపేశాడు.