ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి

47చూసినవారు
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రభుత్వం 700 ఎకరాల భూసేకరణకు అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను రానున్న రెండేళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) యోచిస్తోంది. వరంగల్‌లో భూసేకరణ దాదాపు పూర్తవగా, ఆదిలాబాద్‌లో భారత వాయుసేన అంగీకారంతో ఏఏఐ విమానాశ్రయ అభివృద్ధికి సిద్ధమవుతోంది.

సంబంధిత పోస్ట్