ఎన్నికల్లో ఓడిన అంగన్వాడీ సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం

8చూసినవారు
ఎన్నికల్లో ఓడిన అంగన్వాడీ సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం
TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి, ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. మంత్రి సీతక్క ప్రతిపాదనతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలు ఉంటేనే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, ఇప్పటికే కొత్తవారు నియమితులై ఉంటే వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది. దీంతో త్వరలో అర్హుల అభ్యర్థనలను పరిశీలించి నియామకాలు చేపట్టనుంది.

సంబంధిత పోస్ట్