ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గాయపడిన 14 ఏళ్ల బాలికకు చికిత్స అందించేందుకు ఓ ప్రభుత్వ వైద్యుడు రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత కుటుంబం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించడంతో బాలికకు ఉచితంగా చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు రూ.8 వేల వరకు చెల్లించారు. అయితే మిగిలిన మొత్తం ఇవ్వలేదన్న ఆగ్రహంతో సదరు వైద్యుడు పరీక్షల పేరుతో బాలికను పిలిపించి, ఇప్పటికే అతికిన ఎముకను మళ్లీ విరిచేశాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, అధికారులు విచారణ చేపట్టారు.