కర్ణాటకలో RSS ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగిపై అక్కడి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సిర్వార్ తాలూకా పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్‌కుమార్ అక్టోబర్ 12న లింగసుగూర్‌లో జరిగిన ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో యూనిఫారమ్ ధరించి కవాతులో పాల్గొన్నట్లు గుర్తించడంతో చర్య తీసుకున్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పంచాయతీరాజ్ కమిషనర్ అరుంధతి చంద్రశేఖర్ తెలిపారు. ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.