TG: పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ, కుటుంబంతో సమయం గడపలేని పోలీసులకు ప్రత్యేక సెలవులు ఇవ్వనుంది. తమ కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు ఇక నుంచి సెలవులు తీసుకోవచ్చని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పోలీసు తమ పుట్టిన రోజు, పెళ్లి రోజు నాడు సెలవు తీసుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25నే ఉత్తర్వులు విడుదల కాగా తాజాగా అవి బయటకు వచ్చాయి.