తెలంగాణ ప్రజలు
కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎన్నికల హామీలు అమలు కాకపోవడంతో నిరాశ చెందారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళా పథకాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే ముందు
కాంగ్రెస్ తన పరిస్థితి చూసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో
కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని హరీష్ రావు ఎద్దేవా చేశారు.