TG: ప్రభుత్వం తమ 4 ప్రధాన డిమాండ్లపై స్పష్టత ఇవ్వలేదని ఉద్యోగ సంఘాల జేఏసీ వెల్లడించింది. దసరాకు ఒక DA, ఉగాదికి మరో DA ఇస్తామని CS సంజయ్ జాజు తెలిపారని, పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.1000కోట్లు ఇస్తామన్నారని, PRC నివేదికపై సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారని JAC నేతలు తెలిపారు. CPS కమిటీ ఏర్పాటు, నివేదికకు కాలపరిమితి చెప్పలేదని, రేపటి సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.