
రాత్రి ఆలస్యంగా తింటే హార్మోన్లపై ప్రభావం చూపుతుంది: అధ్యయనాలు
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని, ఇది ఇన్సులిన్, కార్టిసాల్ స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రాత్రి లేట్‌గా తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. పడుకోవడానికి కనీసం రెండు మూడు గంటల ముందు భోజనం చేయాలని, తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట చాక్లెట్లు, ఐస్ క్రీమ్ వంటివి తినడం ఒత్తిడిని పెంచుతుంది. బదులుగా నానబెట్టిన బాదం, పండ్లు లేదా హెర్బల్ టీ తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.




