విధులకు తరచూ గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. వీరితో పాటు మరో 193 మంది వైద్యులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మే నెలలోనే డీఎంఈ పరిధిలో 51 మంది వైద్యులను తొలగించినట్లు సమాచారం. వైద్యుల గైర్హాజరును ఉపేక్షించవద్దని అధికారులకు మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. డీఎంఈ, డీఎస్హెచ్ఎస్లు తమ నివేదికలను మంత్రికి సమర్పించగా, ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా గైర్హాజరవుతున్న వైద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.