TG: రాష్ట్రంలోని 22 ఏ భూములపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు తెలంగాణలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ సీఎం
కేసీఆర్, మాజీ మంత్రులు
కేటీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డితోపాటు పలువురి భూములపై కమిటీ విచారణ జరపనుంది. కమిటీ చైర్ ఛైర్‌పర్సన్‌గా టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేనను నియమించింది. కమిటీ సభ్యులుగా రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్ కుమార్ ఝా, ఆయా జిల్లాల కలెక్టర్లు ఉన్నారు.