
ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి (వీడియో)
TG: జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో హన్మకొండకు చెందిన అసద్, హబీబ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుల్బార్గా నుండి హన్మకొండకు వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.




