రూ.10 కోట్ల చిట్టీల డబ్బులతో పరారైన ప్రభుత్వ టీచర్‌

13చూసినవారు
రూ.10 కోట్ల చిట్టీల డబ్బులతో పరారైన ప్రభుత్వ టీచర్‌
TG: సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బానోతు రాజు చిట్టీల డబ్బులు రూ.10 కోట్లు తీసుకొని పరారయ్యాడు. ఆత్మకూర్(ఎస్) మండలం శెట్టిగూడెంలో స్కూల్‌లో పనిచేస్తున్న రాజు పది రోజులుగా కనిపించడం లేదని, ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడని బాధితులు తెలిపారు. లక్ష్మీనాయక్ తండా, బోట్యతండా, ఏనెగంటి తండా, శెట్టిగూడెం గ్రామాల్లో ప్రజల నుంచి చిట్టీలు వసూలు చేసినట్లు సమాచారం. బాధితులు ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్