వినియోగదారులకు జీఎస్టీ రేటు తగ్గింపుల ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష ప్రారంభించింది. షాంపూ, పప్పుధాన్యాలు వంటి నిత్యావసర ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై పర్యవేక్షిస్తోంది. పన్ను తగ్గింపును సజావుగా అమలు చేయడంలో కొన్ని సంస్థలు విఫలమయ్యాయని ఫిర్యాదులు రావడంతో, రెవెన్యూ శాఖ కఠినంగా స్పందిస్తోంది.