అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: మంత్రి సీతక్క

11చూసినవారు
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: మంత్రి సీతక్క
TG: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం భూపాలపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న 10-15 రోజుల్లో కొత్త సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తామని, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను మహిళల పేరిటే అందజేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్