తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీలైనంత త్వరగా అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలని విజయ్‌కు గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టైంది. విజయ్ తమిళనాడు సీఎంగా త్వరలోనే ప్రమాణం చేయనున్నారు.