యూపీ రాజధాని లక్నోలోని ఒక అపార్ట్‌మెంట్‌లో గ్రామ పంచాయతీ కార్యదర్శి తన ప్రియురాలితో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పోలీసుల ముందే వారిద్దరినీ చెప్పుదెబ్బలు కొట్టింది. 2021లో వివాహమైనప్పటి నుండి భర్త తనను వేధిస్తున్నాడని, రెండున్నరేళ్ల కుమార్తెతో సహా పలుమార్లు ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు యత్నించాడని బాధితురాలు పేర్కొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతడిపై కేవలం శాంతిభంగం కింద మాత్రమే కేసు నమోదు చేశారు.