గ్రామ పంచాయతీ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు: రేవంత్

37చూసినవారు
గ్రామ పంచాయతీ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు: రేవంత్
TG: CM రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. IAS అధికారులకు సమయానికి జీతాలు అందినట్లే పంచాయతీ సిబ్బందికి కూడా అందాలని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి నెలా ₹50 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే, పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పెన్షన్లను ఇకపై నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్షలో సూచించారు.