మనవడిపై ప్రేమతో కిడ్నాప్ చేయించిన తాత

31896చూసినవారు
మనవడిపై ప్రేమతో కిడ్నాప్ చేయించిన తాత
TG: సంగారెడ్డి జిల్లా తాడ్మనుర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. మనవడిపై ప్రేమతో తాత బాబురావు తన బంధువులతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన సూత్రధారి అయిన బాబురావుతో పాటు సునీల్, రవిలను అదుపులోకి తీసుకుని, బాలుడిని తల్లి పద్మకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.