GREAT: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

12954చూసినవారు
GREAT: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు
TG: పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం రావడమే కష్టం. అలాంటిది ఓ యువకుడు ఐదు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. కామారెడ్డి(D) గాంధారిలోని జువ్వాడి ప్రాంతానికి చెందిన రవికుమార్‌ను తల్లిదండ్రులు భూమవ్వరాజయ్య వ్యవసాయం చేస్తూ చదివించారు. HYDద్ రాంనగర్‌లో ఉంటూ రోజుకు 16 గంటలకు పైగా ఏకాగ్రతతో చదివారు. 2018లో భారత ఆహార సంస్థ(FCI)లో గ్రేడ్-3 ఉద్యోగం, 2019లో ఫైర్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2024లో (గ్రూప్-4) రెవెన్యూ శాఖలో JA ఉద్యోగం సాధించాడు. 2022లో గ్రూప్-2, 3 పరీక్షలు రాసి.. ఇటీవల 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ పరిశీలన ప్రక్రియ పూర్తి చేసుకున్నాడు. త్వరలోనే మరో ఉన్నత ఉద్యోగ నియామక పత్రం అందుకోనున్నారు.

సంబంధిత పోస్ట్