పచ్చి మేతలో విటమిన్-ఎ అధికంగా ఉండటం వల్ల పశువుల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అవి ఆరోగ్యంగా ఉండి సకాలంలో యుక్త వయసుకు వచ్చి యద లక్షణాలు చూపించి చూలు కడతాయి. రైతు తనకున్న పొలంలో 1/10 వంతులో పశుగ్రాసాన్ని సాగు చేస్తే పశువుల పోషణ ఖర్చు 25-30 శాతం తగ్గి, పాల నుంచి వచ్చే ఆదాయం 20-30% వరకు పెరుగుతుంది. పచ్చిమేత వల్ల పశువుల జీర్ణక్రియ మెరుగ్గా జరిగి పోషకాలు బాగా అంది పాల దిగుబడి కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.