
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
మధురై నుంచి 76 మంది ప్రయాణికులతో చెన్నై వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్ అవుతుండగా విండ్‌షీల్డ్‌కు పగుళ్లు వచ్చాయి. పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులను సురక్షితంగా దించి విండ్‌షీల్డ్‌ను మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మధురైకి తిరుగు ప్రయాణం రద్దు చేయబడింది.




