
అఫ్గానిస్థాన్తో సంబంధాలు నిలిపేసిన పాక్
అఫ్గానిస్థాన్తో ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలను పాకిస్థాన్ నిలిపివేసింది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అధికారికంగా ప్రకటించారు. అఫ్గానిస్థాన్ తాలిబాన్ పాలన కింద నుంచి వస్తున్న ఉగ్రవాద దాడులు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డాన్, జియో న్యూస్ వంటి ప్రముఖ పత్రికలు ఈ వార్తను వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తత వాతావరణంలో కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించాయి.




