ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన లేఖ్‌పాల్ సుధీర్ కుమార్, తన వివాహానికి ఒక రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహానికి సెలవు కోసం అతను చేసిన అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. పనికి గైర్హాజరైనందుకు అతన్ని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. అంతటితో ఆగకుండా అతడిపై ఒత్తిడి తెచ్చేందుకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిని ఇంటికి పంపారు. దీంతో మనస్తాపం చెందిన సుధీర్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.