
కాంతార చాప్టర్ 1: నాలుగు రోజుల్లోనే 300 కోట్లు దాటిన కలెక్షన్
దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం, 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 7 భాషల్లో, దాదాపు 7000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మొదటి 3 రోజుల్లోనే రూ. 235 కోట్లు రాబట్టింది. నాలుగో రోజున ఇండియాలో ఒక్క రోజే రూ. 61.5 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం కేజీఎఫ్ 2 తర్వాత వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.




