జీఎస్టీ వసూళ్లు రూ. 1.95 లక్షల కోట్లు.. 14% వృద్ధి

27చూసినవారు
జీఎస్టీ వసూళ్లు రూ. 1.95 లక్షల కోట్లు.. 14% వృద్ధి
దేశీయంగా సరఫరా పెరగడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో జూన్‌లో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) స్థూల వసూళ్లు రూ. 1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాది జూన్‌తో పోలిస్తే సుమారు 14% అధికం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 8.4% పెరిగి రూ. 6.32 లక్షల కోట్లకు చేరాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతున్నా, జీఎస్టీ నెలవారీ వసూళ్లు క్రమంగా రూ. 2 లక్షల కోట్లకు చేరువవుతున్నాయని నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్