దేశంలో మే నెల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం వృద్ధి కనిపించింది. రిఫండ్ల సర్దుబాటు అనంతరం నికర వసూళ్లు రూ.1,66,904 కోట్లుగా ఉన్నాయి. మొత్తం రీఫండ్లు 2.6 శాతం పెరిగి రూ.27,281 కోట్లుగా ఉన్నాయి. దేశీయ రీఫండ్లు తగ్గగా, ఎగుమతి ఆధారిత రీఫండ్లు పెరిగాయి. ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీ వసూళ్లు 6.2 శాతం పెరిగి 4.37 లక్షల కోట్లకు చేరాయి.