
పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా PoKలో ఆందోళనలు (వీడియో)
పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీవోకేలో భారీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి 70 ఏళ్లుగా తమకు ప్రాథమిక హక్కులు ఇవ్వలేదని విమర్శించారు. 38 డిమాండ్ల అమలు కోరుతూ "షటర్డౌన్, వీల్జామ్" సమ్మెకు పిలుపునిచ్చారు. నిరసనలు ఉద్ధృతం కావడంతో పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ నిలిపివేసి, భారీగా పోలీసులను మోహరించింది.




