జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశంలో కొనుగోళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మీడియా ఎదుట తెలిపారు. సెప్టెంబర్ 22న తీసుకువచ్చిన కొత్త పన్ను తగ్గింపుల వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగిందని అన్నారు. దసరా సందర్భంగా రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయన్న విషయం స్పష్టమవుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.