ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఒక వివాహ విందులో నాన్-వెజ్ వంటకం (బోటి) అయిపోవడంతో ఆగ్రహించిన అతిథులు ఫంక్షన్ హాల్‌ను రణరంగంగా మార్చారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ దాడికి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.