TG: రాష్ట్రవ్యాప్తంగా 2020 OCT 12 నుంచి NOV 10వ తేదీ వరకు స్వీకరించిన సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. భూమి కొనుగోలుదారు మాత్రమే ఆధారాలతో కూడిన అఫిడవిట్ జత చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధారాలు పరిశీలించి క్రమబద్ధీకరణకు సిఫార్సు చేస్తారు. 30 రోజుల్లోగా భూ యజమాని పేరును భూ భారతిలో నమోదు చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైతే.. క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేసి పరిశీలన చేస్తారు. అక్రమమని తేలితే క్రిమినల్ కేసు నమోదుకు సిఫార్సు చేస్తారు.