
సెలూన్ షాపులో యువకుడి దారుణ హత్య
AP: ఒంగోలు 60 ఫీట్ రోడ్డులోని ఓ సెలూన్ షాపులో పనిచేస్తున్న మహేంద్రరావు (30) అనే యువకుడిని మద్యం మత్తులో ఉన్న రామారావు కత్తితో పొడిచి హత్య చేశాడు. సెలూన్ షాపు వద్ద గొడవ చేస్తున్న రామారావును వెళ్లిపోవాలని మహేంద్ర కోరడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. రామారావు సెలూన్లోని కత్తులతో దాడికి దిగి హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.




