IPL-2026లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచులో CSKను గుజరాత్ చిత్తుగా ఓడించింది. చెన్నై మీద 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన CSK నిర్ణీత 20 ఓవర్లలో 158/7 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గిల్ సేన 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. సుదర్శన్ (87) అర్థ సెంచరీతో చెలరేగారు. గిల్ 33, జోస్ బట్లర్ 39 పరుగులతో రాణించారు. హోసేన్, నూర్ అహ్మద్ తలో ఒక వికెట్ తీశారు.