
KPHBలో గజం భూమి ధర రూ.2.70 లక్షలు
గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కేపీహెచ్‌బీకి ఉన్న క్రేజ్‌ను మరోసారి రుజువు చేస్తూ, కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలానికి భారీ స్పందన లభించింది. బుధవారం జరిగిన ఈ వేలంలో 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు 19 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. గజానికి కనీస మద్దతు ధర రూ.1.60 లక్షలుగా ఉండగా, గరిష్టంగా రూ.2.70 లక్షల వరకు ధర పలికింది. ఈ వేలం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది.




