బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నేషనల్ పార్క్ పరిసరాల్లో మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. గంటల పాటు కొనసాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో కొందరు మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.