AP: శైలంలో తుపాకీ కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు ఓ కారును సెర్చ్ చేశారు. అయితే కారు నడుపుతున్న వ్యక్తి వద్ద గన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను విచారించారు. అయితే తాను మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్సై అని చెప్పారు. దీంతో రివాల్వర్, ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకునేందుకు వచ్చినట్లు సైబర్ క్రైమ్ ఎస్సై తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.