
10 ఏళ్ల మైనర్ బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం
AP: తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో 10 ఏళ్ల మైనర్ బాలికపై 45 ఏళ్ల చీరల రమేష్ నాయుడు అనే వ్యక్తి అఘాయిత్యాానికి ఒడిగట్టాడు. ఇంటి బయట ఆడుకుంటున్న 5వ తరగతి చదువుతున్న బాలికను ఆటోలో ఊరి బయటకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశాడు. సోమవారం జరిగిన ఈ దారుణాన్ని బాధితురాలు మరుసటి రోజు తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.




