సంతానం, ధనం, విద్య వంటి విషయాలకు కారకుడైన గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి పిల్లల నుంచి శుభవార్తలు వినిపించనున్నాయి. పిల్లలు చదువుల్లో, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.