ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దారుణం చోటుచేసుకుంది. బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లిన ఒక యువతిపై జిమ్ ట్రైనర్ అక్రమ్ బేగ్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వ్యాయామానికి ముందు మత్తు మాత్ర ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సహకరించిన అక్రమ్ సోదరుడు ఆలం బేగ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.