హెచ్-1బీ
వీసా ప్రోగ్రామ్ పూర్తిగా పాడైపోయిందని, దాని రద్దుకు తాను పూర్తి మద్దతు ఇస్తానని
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికన్ వర్కర్లకు దక్కాల్సిన ఉద్యోగాలను తక్కువ వేతనంతో విదేశీయులతో భర్తీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టెక్నాలజీ, అకౌంటింగ్ సంస్థలు ఈ ప్రోగ్రామ్ను దుర్వినియోగపరుస్తున్నాయని, 60 వేల డాలర్లు తీసుకునే అమెరికన్ను తొలగించి, 45 వేల డాలర్లకు విదేశీయులను నియమించుకోవడం మోసమని వాన్స్ అన్నారు.