ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అదనపు కట్నం వేధింపులు.. పెళ్లయిన 18 రోజులకే నవ వధువు ఆత్మహత్య
Sep 19, 2026, 05:09 IST/

అదనపు కట్నం వేధింపులు.. పెళ్లయిన 18 రోజులకే నవ వధువు ఆత్మహత్య

Sep 19, 2026, 05:09 IST
TG: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో అదనపు కట్నం వేధింపులు తాళలేక, పెళ్లయిన 18 రోజులకే పల్లవి (20) అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆగస్టు 30న చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డితో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన తర్వాత అదనపు కట్నం కోసం భర్త నుంచి శారీరక, మానసిక వేధింపులు పెరగడంతో తాను చదువుతున్న కళాశాల భవనం మూడో అంతస్తు పైనుంచి దూకి ప్రాణాలు విడిచింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.