అమెరికా హెచ్-1బి వీసా ఫీజును పెంచుతూనే కొన్ని మినహాయింపులను ప్రకటించింది. ప్రస్తుతం వీసా ఉన్నవారు ఫీజు కట్టనవసరం లేదు. అయితే, 12 నెలలకు పైగా ఇతర దేశాల్లో ఉండి తిరిగి అమెరికా వెళ్లేవారు వెంటనే వెళ్ళాలి, లేకపోతే కొత్త ఫీజు కట్టాలి. ఆరోగ్య సంరక్షణ, సైనిక, ఇంజినీరింగ్ వంటి కీలక రంగాల్లో పనిచేసేవారికి, అలాగే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అనుమతి పొందినవారికి ఈ కొత్త ఫీజు వర్తించదని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.