అమెరికా 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన H‑1B విసా రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. దరఖాస్తులకు మార్చి 19 వరకు గడువు ఉంది. ఈసారి యునైటెడ్ స్టేట్ సిజిటన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిబంధనలను కఠినతరం చేసింది. విదేశాల నుంచి ఉద్యోగులను నియమించుకునే కంపెనీలు అదనంగా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ విధానంలో కూడా ఎక్కువ జీతం, నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చేలా ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతి తీసుకొచ్చారు. అలాగే సోషల్ మీడియా వెరిఫికేషన్‌ను కూడా తప్పనిసరి చేశారు.