
భారత్కు అమెరికా అంబాసిడర్గా సెర్గియో గోర్
భారత్కు అమెరికా కొత్త అంబాసిడర్గా సెర్గియో గోర్ నియామకం ఖరారైంది. 38 ఏళ్ల గోర్ నామినేషన్ను సెనేట్ ఆమోదించింది. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికా ప్రాధాన్యమని గోర్ తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య బంధాలు చైనా ప్రభావాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతలో భారత్ పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.




