
టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అభ్యంతరం
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్టించిన విషయంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా క్రైస్తవుల దేశమని, హిందువులు పూజించే దేవుడు నకిలీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఖండించింది. ఏ మతాన్నైనా అవలంబించే స్వేచ్ఛను అమెరికా రాజ్యాంగం కల్పించిందని, డంకన్ వ్యాఖ్యలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయని ఆరోపించింది.




