హెచ్1ఎన్1 ఉధృతి: ఫ్లూ వ్యాక్సిన్లకు 3 రెట్లు పెరిగిన డిమాండ్!

69చూసినవారు
హెచ్1ఎన్1 ఉధృతి: ఫ్లూ వ్యాక్సిన్లకు 3 రెట్లు పెరిగిన డిమాండ్!
దేశంలో హెచ్1ఎన్1, ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతుండటంతో ఫ్లూ వ్యాక్సిన్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, 5 ఏళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, ఆస్తమా, డయాబెటిస్, గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. టీకా వేసుకున్న రెండు వారాల తర్వాత రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇది ఆసుపత్రిలో చేరే ముప్పును 30-40% వరకు తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్