దేశంలో H1N1 వ్యాప్తి.. ICMR కీలక ప్రకటన

10528చూసినవారు
దేశంలో H1N1 వ్యాప్తి.. ICMR కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా హెచ్‌1ఎన్‌1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది కొత్త వైరస్ కాదని, 2009 నాటి ఇన్‌ఫ్లుయెంజా-ఏ (హెచ్‌1ఎన్‌1) పీడీఎం09 వైరస్ ఇప్పుడు ఫ్లూగా కొనసాగుతోందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ తెలిపారు. వైరస్‌లో చిన్నపాటి జన్యు మార్పులు సహజమేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే వైద్యుల సూచనతో టీకా తీసుకోవచ్చని, యాంటీబయాటిక్స్‌ పనిచేయవని, యాంటీవైరల్‌ మందులు వాడాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్